సెమీస్‌లో సిరిల్ వర్మ | Siril Varma reaches semis of World Junior Championships | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సిరిల్ వర్మ

Nov 15 2015 4:44 AM | Updated on Aug 17 2018 8:01 PM

సెమీస్‌లో సిరిల్ వర్మ - Sakshi

సెమీస్‌లో సిరిల్ వర్మ

ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజం అల్లూరి శ్రీసాయి సిరిల్ వర్మ విజయపరంపర కొనసాగుతోంది.

సాక్షి, హైదరాబాద్: ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజం అల్లూరి శ్రీసాయి సిరిల్ వర్మ విజయపరంపర కొనసాగుతోంది. హైదరాబాద్‌కు చెందిన 15 ఏళ్ల ఈ కుర్రాడు బాలుర సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పెరూలోని లిమా నగరంలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో సిరిల్ వర్మ మరోసారి సీడెడ్ క్రీడాకారుడిని బోల్తా కొట్టించి ముందంజ వేశాడు.

భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సిరిల్ 21-15, 21-14తో పదో సీడ్ సతీస్‌థరన్ (మలేసియా)పై గెలిచాడు. అంతకుముందు సిరిల్ మూడో రౌండ్‌లో తొమ్మిదో సీడ్ కాంతాపోన్ వాంగ్‌చెరన్ (థాయ్‌లాండ్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ ఆందెర్స్ అంటోన్‌సెన్ (డెన్మార్క్)పై సంచలన విజయాలు సాధించాడు.

Advertisement
 
Advertisement
Advertisement