నాలుగో ర్యాంకుకు సింధు | Sindhu to fourth rank | Sakshi
Sakshi News home page

నాలుగో ర్యాంకుకు సింధు

May 8 2017 10:54 PM | Updated on Sep 5 2017 10:42 AM

నాలుగో ర్యాంకుకు సింధు

నాలుగో ర్యాంకుకు సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఓ స్థానం కోల్పోయి

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఓ స్థానం కోల్పోయి నాలుగో ర్యాంకులో నిలిచింది. బ్యాడ్మింటన్‌ ఆసియా చాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్‌లోనే వెనుదిరగడం సింధు ర్యాంకుపై ప్రభావం చూపింది.

మరో భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌ కూడా ఓ స్థానం దిగజారి తొమ్మిది ర్యాంకులో నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో అజయ్‌ జయరామ్‌ (13వ ర్యాంకు), బీ సాయిప్రణీత్‌ (22), కిడాంబి శ్రీకాంత్‌ (26), సమీర్‌ వర్మ (27), హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (30వ ర్యాంకులో) నిలిచారు. 

Advertisement
 
Advertisement
Advertisement