సోమ్‌దేవ్‌కు షాక్ | shock to somdev | Sakshi
Sakshi News home page

సోమ్‌దేవ్‌కు షాక్

Feb 27 2014 1:16 AM | Updated on Sep 2 2017 4:07 AM

దుబాయ్ ఓపెన్ టోర్నీ తొలి రౌండ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ డెల్‌పొట్రోపై సంచలన విజయం నమోదు చేసిన భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు రెండో రౌండ్‌లో అనూహ్య ఓటమి ఎదురైంది.


 
 న్యూఢిల్లీ: దుబాయ్ ఓపెన్ టోర్నీ తొలి రౌండ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ డెల్‌పొట్రోపై సంచలన విజయం నమోదు చేసిన భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు రెండో రౌండ్‌లో అనూహ్య ఓటమి ఎదురైంది.

 

బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ 78వ ర్యాంకర్ సోమ్‌దేవ్ 3-6, 5-7తో ప్రపంచ 137వ ర్యాంకర్ మాలిక్ జజిరి (ట్యూనిషియా) చేతిలో ఓడిపోయాడు. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సోమ్‌దేవ్ నాలుగు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. రెండో రౌండ్‌లో ఓడిన సోమ్‌దేవ్‌కు 24,475 డాలర్ల (రూ.15 లక్షల 17 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement