తొలి రౌండ్‌లోనే పరాజయం | Serena Williams out of Miami Open as Naomi Osaka wins in straight sets | Sakshi
Sakshi News home page

తొలి రౌండ్‌లోనే పరాజయం

Mar 22 2018 4:24 PM | Updated on Mar 22 2018 4:24 PM

Serena Williams out of Miami Open as Naomi Osaka wins in straight sets - Sakshi

మియామి:ప‍్రపంచ మాజీ నంబర్‌ వన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి, నల్లకలువ సెరెనా విలియమ్స్‌కు మరో ఓటమి ఎదురైంది. మియామి ఓపెన్‌లో భాగంగా బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ నుంచే సెరెనా నిష్ర్కమించింది.

జపాన్‌కు చెందిన నయోమి ఒసాకాతో జరిగిన పోరులో సెరెనా 3-6, 2-6 తేడాతో ఓటమి పాలైంది. గంటా 17 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఓసాకా దాటికి సెరెనా ఏమాత్రం సమాధానం ఇవ్వలేకపోయింది. దాంతో మియామిలో సత్తాచాటాలనుకున్న సెరెనా ఆశలు ఆదిలోనే ఆవిరయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement