సెమీస్‌లో సాకేత్‌ | Saketh enters semis of ITF Tourney | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాకేత్‌

Mar 9 2018 10:24 AM | Updated on Mar 9 2018 10:24 AM

Saketh enters semis of ITF Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఇండియన్‌ ఫ్యూచర్స్‌–2 పురుషుల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని నిలకడగా రాణిస్తున్నాడు.

కోల్‌కతాలో జరుగుతోన్న ఈ టోర్నీలో సాకేత్‌ సింగిల్స్‌ విభాగంలో సెమీస్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఏడో సీడ్‌ సాకేత్‌ 6–3, 6–3తో రెండోసీడ్‌ శశికుమార్‌ ముకుంద్‌కు షాకిచ్చాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ఐదో సీడ్‌ అర్జున్‌తో సాకేత్‌ తలపడతాడు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement