సైనా నెహ్వాల్‌పై కోర్టుకెళతాం: పున్నయ్య | Saina Nehwal may skip senior Nationals | Sakshi
Sakshi News home page

సైనా నెహ్వాల్‌పై కోర్టుకెళతాం: పున్నయ్య

Feb 2 2015 1:13 AM | Updated on Sep 2 2017 8:38 PM

సైనా నెహ్వాల్‌పై కోర్టుకెళతాం: పున్నయ్య

సైనా నెహ్వాల్‌పై కోర్టుకెళతాం: పున్నయ్య

భారత్‌లో జరిగే దేశవాళీ టోర్నమెంట్‌లకు దూరంగా ఉంటున్న స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌పై కోర్టుకు వెళ్తామని...

విజయవాడ స్పోర్ట్స్: భారత్‌లో జరిగే దేశవాళీ టోర్నమెంట్‌లకు దూరంగా ఉంటున్న స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌పై కోర్టుకు వెళ్తామని ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి పున్నయ్య చౌదరి తెలిపారు. భారత్‌కు చెందిన అంతర్జాతీయస్థాయి క్రీడాకారులందరూ దేశవాళీ టోర్నీల్లో ఆడాలనే నిబంధన ఉన్నప్పటికీ... సైనా దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని పున్నయ్య విమర్శించారు.

ప్రస్తుతం జరుగుతోన్న జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాలని సైనాకు నాలుగుసార్లు మెయిల్ పంపించినా ఆమె నుంచి కనీస స్పందన రాలేదన్నారు. స్టార్ ప్లేయర్లు  పాల్గొనకపోతే స్పాన్సర్లు రాకుండా పోతారని... ఆటకు ఆదరణ కూడా తగ్గుతుందన్నారు. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చి దేశవాళీ టోర్నీలకు దూరంగా ఉండే క్రీడాకారులపై చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వానికి సూచించేలా కోర్టుకెళ్లనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement