క్రికెట్‌ దేవుడే దిగి వస్తే... | Sachin Tendulkar playing cricket on the streets of Mumbai | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ దేవుడే దిగి వస్తే...

Apr 18 2018 2:32 AM | Updated on Apr 18 2018 2:32 AM

 Sachin Tendulkar playing cricket on the streets of Mumbai - Sakshi

అది ముంబైలోని బాంద్రా ప్రాంతం... నిర్మాణంలో ఉన్న మెట్రో వద్ద రాత్రివేళ కొందరు కుర్రాళ్లు క్రికెట్‌ ఆడుతున్నారు. ఇంతలో అక్కడో కారు ఆగింది... అందులోంచి తెల్ల చొక్కా, నల్ల ప్యాంట్‌ వేసుకున్న వ్యక్తి దిగాడు... నేరుగా యువకుల వద్దకు వచ్చి కరచాలనం చేశాడు... ఇది కలా? నిజమా? అని ఆశ్చర్యంలో ఉండగానే వారి నుంచి బ్యాట్‌ తీసుకుని తనదైన శైలిలో ఐదు బంతులు ఆడాడు... సెల్ఫీలు దిగాడు. ఇంతలో జనం పోగవసాగారు. దీంతో ఆ ‘క్రికెట్‌ దేవుడు’ మాయమైపోయాడు. ఇప్పటికే అర్థమైందిగా వచ్చింది ఎవరనేది? అవును...! ఆ వ్యక్తి సచిన్‌ టెండూల్కర్‌. ఈ మేరకు వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement