అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నాడు: ద్రవిడ్‌ | Sakshi
Sakshi News home page

అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నాడు: ద్రవిడ్‌

Published Sun, Dec 31 2017 3:14 PM

Pandya has grabbed the opportunity with both hands, says rahul dravid - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత క్రికెట్‌ జట్టులో నెలకొన్న పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జట్టులోకి ఒకసారి వచ్చిన ప్రతీ ఆటగాడు అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడం లేదు. దాంతో ప‍్రధాన ఆటగాళ్ల స్థానానికి కూడా గ్యారెంటీ లేకుండా పోయింది. ఇలా భారత క్రికెట్‌ జట్టులోకి వచ్చి రెగ్యులర్‌ ఆటగాళ్లగా మారిపోయిన జాబితాలో ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ముందువరుసలో ఉన్నాడు. అయితే హార్దిక్‌ ప‍్రతిభను గుర్తించడంలో భారత​-ఎ, అండర్‌-19 కోచ్‌ గా పని చేస్తున్న రాహుల్‌ ద్రవిడ్‌ పాత్ర వెలకట్టలేనిది. అయితే హార్దిక్‌ గురించి ద్రవిడ్‌ ఏమన్నాడంటే అతని మాటల్లోనే..

'ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌ రౌండర్‌ కోసం అన్వేషించే క్రమంలో హార్దిక్‌ ప్రతిభను గుర్తించడం జరిగింది. మన దేశంలో ఒక బ‍్యాట్స్‌మన్‌ కోసం కానీ స్పిన్‌ బౌలింగ్‌ కోసం కానీ అన్వేషించాలంటే పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇందుకు చాలామంది పోటీ పడుతుండటం మనం చూస్తునే ఉన్నాం. అదే ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌ రౌండర్లను వేళ్లతో లెక్కపెట్టవచ్చు. ఇప్పటివరకూ ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌ రౌండర్లు దేశానికి ప్రాతినిథ్యం వహించింది చాలా తక్కువ. ఇలా వెతికి పట్టుకున్న ఆల్‌ రౌండరే హార్దిక్‌. అలా అతనికి వచ్చిన అవకాశాన్ని హార్దిక్‌ రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. ఈ క్రెడిట్‌ అంతా అతనికే దక్కుతుంది. నిలకడగా రాణిస్తూ టీమిండియా విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నాడు' అని ద్రవిడ్‌ కొనియాడాడు.

Advertisement
Advertisement