పాక్ కోచ్‌గా స్టువర్ట్ లా! | Pakistan coach Stuart Law! | Sakshi
Sakshi News home page

పాక్ కోచ్‌గా స్టువర్ట్ లా!

May 5 2016 12:47 AM | Updated on Sep 3 2017 11:24 PM

పాక్ కోచ్‌గా స్టువర్ట్ లా!

పాక్ కోచ్‌గా స్టువర్ట్ లా!

పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు స్టువర్ట్ లా పేరు వినిపిస్తోంది.

కరాచి: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు స్టువర్ట్ లా పేరు వినిపిస్తోంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ప్రకటించలే దు. కానీ మంగళవారం లాహోర్‌లో జరిగిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీవోజీ) సమావేశం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.

స్టువర్ట్ లాను కోచ్‌గా నియమించాలనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు బోర్డు సభ్యులు తెలిపారు. మరోవైపు ఫిబ్రవరిలో యూఏఈలో నిర్వహించిన తొలి సీజన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ద్వారా రూ.17. 30 కోట్ల (2.6 మిలియన్ డాలర్స్) లాభాన్ని ఆర్జించిన ట్లు పీసీబీ వెల్లడించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement