అద్వానీ ఖాతాలోమరో జాతీయ టైటిల్‌ | National Championship Pankaj Advani Beats Sourav Kothari | Sakshi
Sakshi News home page

అద్వానీ ఖాతాలోమరో జాతీయ టైటిల్‌

Jan 29 2020 2:15 AM | Updated on Jan 29 2020 2:15 AM

National Championship Pankaj Advani Beats Sourav Kothari  - Sakshi

పుణే: భారత స్టార్‌ క్యూయిస్ట్‌ పంకజ్‌ అద్వానీ ఖాతాలో మరో టైటిల్‌ చేరింది. సీనియర్‌ జాతీయ బిలియర్డ్స్‌ ఛాంపియన్ షిప్ లో అద్వానీ విజేతగా నిలిచాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో అతను 5–2 ఫ్రేమ్స్‌ తేడాతో సౌరవ్‌ కొఠారీపై విజయం సాధించాడు. తొలి ఫ్రేమ్‌  కోల్పోయిన అద్వానీ 13–150, 152–12, 151–0, 62–150, 150–45, 150–48, 150–2తో ప్రత్యర్థిని ఓడించాడు. ఓవరాల్‌గా జాతీయ స్థాయిలో ఈ వెటరన్‌ క్యూ స్పోర్ట్స్‌ స్టార్‌కు 33వ టైటిల్‌ కాగా... సీనియర్‌ కేటగిరీలో పదో టైటిల్‌. 3, 4 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో ధ్వజ్‌ హరియా 3–0తో బ్రిజేశ్‌ దమానిపై గెలుపొందాడు.  

Advertisement
 
Advertisement
Advertisement