దేవేంద్రోకు పతకం ఖాయం | medal to Devendro | Sakshi
Sakshi News home page

దేవేంద్రోకు పతకం ఖాయం

Jun 23 2017 12:57 AM | Updated on Sep 5 2017 2:14 PM

ఉలాన్‌బాటర్‌ కప్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత బాక్సర్‌ దేవేంద్రో సింగ్‌ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు.

న్యూఢిల్లీ: ఉలాన్‌బాటర్‌ కప్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత బాక్సర్‌ దేవేంద్రో సింగ్‌ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో జరుగుతోన్న ఈటోర్నీ 52 కేజీల వెయిట్‌ కేటగిరీలో దేవేంద్రో సింగ్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు.

దీంతో దేవేంద్రోకు కనీసం కాంస్య పతకం దక్కుతుంది. గురువారం జరిగిన బౌట్‌లో దేవేంద్రో సింగ్, రష్యాకు చెందిన దిమిత్రి యుసుపోవ్‌పై గెలుపొంది పతకపోరుకు సిద్ధమయ్యాడు. 

Advertisement
 
Advertisement
Advertisement