జూనియర్ మహిళల జట్టుకు తొలి విజయం | Junior women's team to its first victory | Sakshi
Sakshi News home page

జూనియర్ మహిళల జట్టుకు తొలి విజయం

Oct 26 2016 11:07 PM | Updated on Sep 4 2017 6:23 PM

ఐదు దేశాల ఇన్విటేషనల్ అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్‌లో భారత జూనియర్ మహిళల జట్టు తొలి విజయాన్ని...

వాలెన్సియా (స్పెరుున్): ఐదు దేశాల ఇన్విటేషనల్ అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్‌లో భారత జూనియర్ మహిళల జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆతిథ్య స్పెరుున్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2తో గెలిచింది. భారత్ తరఫున జ్యోతి (28వ ని.లో), రితూ (42వ ని.లో), సంగీత కుమారి (62వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. గురువారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్‌లో జర్మనీతో భారత్ ఆడుతుంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement