బెలారస్‌పై భారత్‌ ఘనవిజయం | India's victory over Belarus | Sakshi
Sakshi News home page

బెలారస్‌పై భారత్‌ ఘనవిజయం

Mar 3 2017 12:32 AM | Updated on Sep 5 2017 5:01 AM

ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో భారత మహిళా హాకీ జట్టు బెలారస్‌పై 5–1తో ఘనవిజ యం సాధించింది.

భోపాల్‌: ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో భారత మహిళా హాకీ జట్టు బెలారస్‌పై 5–1తో ఘనవిజ యం సాధించింది. మ్యాచ్‌లో నవజోత్‌ కౌర్‌ చేసిన రెండు గోల్స్‌తో భారత్‌ ఖాతా తెరిచింది. 11వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ని గోల్‌గా మలిచిన నవజోత్‌ ఆ వెంటనే 15వ నిమిషంలో చక్కని ఫీల్డ్‌ గోల్‌తో భారత్‌ను 2–0 ఆధిక్యంలోకి తీసుకువెళ్లింది.

ఈ సమయంలో బెలారస్‌ ఆటగాళ్ల డిఫెన్స్‌ను ఛేదిస్తూ పూన మ్‌ బర్ల (29వ నిమిషం) మరో చక్కనిగోల్‌తో భారత స్కోర్‌ను మూడుకి పెంచింది. బెలారస్‌ క్రీడాకారిణి స్వెత్లానా బహుషివిచ్‌ (37వ నిమిషం) గోల్‌ చేసి ఆధిక్యాన్ని 3–1కి తగ్గించినా... చివర్లో ఎక్కా (57వ ని.), గుర్జిత్‌కౌర్‌ (60వ ని.)లు పెనాల్టీకార్నర్లతో భారత్‌కు ఘనమైన ముగింపునిచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement