‘టాప్స్‌’లో భారత మహిళల హాకీ జట్టు! | Indian women's hockey team set to be included in TOPS after Asian Games 2018 silver | Sakshi
Sakshi News home page

‘టాప్స్‌’లో భారత మహిళల హాకీ జట్టు!

Oct 1 2018 5:51 AM | Updated on Oct 1 2018 5:52 AM

Indian women's hockey team set to be included in TOPS after Asian Games 2018 silver - Sakshi

భారత మహిళల హాకీ జట్టు

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో రజతం సాధించిన భారత మహిళల హాకీ జట్టును త్వరలో టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం పథకం (టాప్స్‌)లో చేర్చనున్నారు. తదుపరి ‘టాప్స్‌’ సమావేశంలో జట్టులోని మొత్తం 18 మంది సభ్యులను ఈ పథకం కిందికి తేనున్నారు. ఇప్పటికే భారత పురుషుల జట్టు ‘టాప్స్‌’లో ఉంది.   

48 మంది ప్రాబబుల్స్‌...
‘సాయ్‌’ ఆధ్వర్యంలో నేటి నుంచి బెంగళూరులో జరుగనున్న జాతీయ మహిళల శిబిరానికి హాకీ ఇండియా 48 మందితో కూడిన ప్రాబబుల్స్‌ జాబితా ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోల్‌కీపర్‌ ఇతిమరపు రజని, తెలంగాణకు చెందిన ఫార్వర్డ్‌ యెండల సౌందర్య చోటు దక్కించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement