సెమీస్‌లో దేవేంద్రో, శివ, వికాస్ | In a mix-up Devendro, Shiva, Vikas | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో దేవేంద్రో, శివ, వికాస్

Sep 2 2015 3:32 AM | Updated on Sep 3 2017 8:33 AM

సెమీస్‌లో దేవేంద్రో, శివ, వికాస్

సెమీస్‌లో దేవేంద్రో, శివ, వికాస్

ఆసియా సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ముగ్గురు భారత బాక్సర్లు దేవేంద్రో సింగ్ (49 కేజీలు)

 బ్యాంకాక్ : ఆసియా సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ముగ్గురు భారత బాక్సర్లు దేవేంద్రో సింగ్ (49 కేజీలు), శివ థాపా (56 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. దీంతో కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకోవడంతోపాటు వచ్చే నెలలో దోహాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కూ అర్హత సాధించారు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో దేవేంద్రో 3-0తో కార్నెలిస్ లాంగూ (ఇండోనేసియా)పై, శివ థాపా 2-1తో మాలాబెకోవ్ (కిర్గిజిస్తాన్)పై, వికాస్ 3-0తో దిన్ హోంగ్ త్రువోంగ్ (వియత్నాం)పై గెలిచారు.

అయితే కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ మనోజ్ కుమార్ (64 కేజీలు), మన్‌ప్రీత్ సింగ్ (91 కేజీలు) మాత్రం క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. మనోజ్ 0-3తో ఫజ్లిద్దిన్ గైబనజరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో; మన్‌ప్రీత్ 0-3తో తులగనోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement