సాయ్ హాస్టల్‌కు టైటిల్ | hyderabad hockey cup winner sai hostel | Sakshi
Sakshi News home page

సాయ్ హాస్టల్‌కు టైటిల్

Aug 13 2016 4:04 PM | Updated on Sep 4 2018 5:21 PM

హైదరాబాద్ హాకీ కప్ టైటిల్‌ను సాయ్ హాస్టల్ గెలుచుకుంది. సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను సాయ్ హాస్టల్ డ్రాగా ముగించింది.

హైదరాబాద్: హైదరాబాద్ హాకీ కప్ టైటిల్‌ను సాయ్ హాస్టల్ గెలుచుకుంది. సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను సాయ్ హాస్టల్ డ్రాగా ముగించింది. తెలంగాణ పోలీస్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఇరుజట్లూ గోల్స్ చేయలేకపోయాయి. అయితే ఈ టోర్నీలో వరుస విజ యాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన సాయ్ హాస్టల్ జట్టు విజేతగా నిలిచింది.

మరో మ్యాచ్‌లో నవభారత్ క్లబ్ 7-3 తో రాయల్ క్లబ్‌పై విజయం సాధించి టోర్నీలో రన్నరప్‌గా నిలి చింది. నవభారత్ తరఫున అరవింద్ 3, రాహుల్ రాజ్ 2, మహేందర్ కిరణ్ 2 గోల్స్ చేయగా... రాయల్ క్లబ్ తరఫున రాజు 2, యశ్వంత్ ఒక గోల్ సాధించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో రెండు సార్లు ఆసియా గేమ్స్‌లో కాంస్య పతక విజేత నిధి, ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్, రాష్ట్ర హాకీ సంఘం ఉపాధ్యక్షుడు కాశీ, టోర్నమెంట్ డెరైక్టర్ ఆల్ఫోన్స్ లాజరెస్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement