వారియర్స్‌కు రెండో గెలుపు | Hockey India League: Punjab Warriors register first win, beat ... | Sakshi
Sakshi News home page

వారియర్స్‌కు రెండో గెలుపు

Jan 29 2014 1:17 AM | Updated on Sep 2 2017 3:06 AM

ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన పంజాబ్ వారియర్స్ జట్టు హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో రెండో విజయాన్ని నమోదు చేసింది.

 భువనేశ్వర్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన పంజాబ్ వారియర్స్ జట్టు హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7-3 గోల్స్ తేడాతో కళింగ లాన్సర్స్‌ను ఓడించింది.

 
 వారియర్స్ తరఫున స్టార్ డ్రాగ్ ఫ్లికర్ సందీప్ సింగ్, అఫాన్ యూసుఫ్ రెండేసి గోల్స్ చేయగా... ధరమ్‌వీర్ సింగ్, లూకాస్ మార్టిన్ రే, సిమోన్ ఆర్చర్డ్, కెప్టెన్ జేమీ డ్వెయర్ ఒక్కో గోల్ సాధించారు. కళింగ జట్టులో గొంజాలో పెలియట్ రెండు గోల్స్, మన్‌దీప్ అంటిల్ ఒక గోల్ చేశారు. రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి, మరో మ్యాచ్‌లో ఓడిన వారియర్స్ 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement