భారత మహిళలకు మరో ఓటమి | HAWKS CUP Spring Tournament 2016 | Sakshi
Sakshi News home page

భారత మహిళలకు మరో ఓటమి

Apr 6 2016 12:03 AM | Updated on Sep 3 2017 9:16 PM

న్యూజిలాండ్‌లో జరుగుతోన్న హాక్స్‌బే కప్ టోర్నమెంట్‌లో భారత మహిళల హాకి జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది.

హాస్టింగ్స్: న్యూజిలాండ్‌లో జరుగుతోన్న హాక్స్‌బే కప్ టోర్నమెంట్‌లో భారత మహిళల హాకి జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ 1-2తేడాతో చైనా చేతిలో ఓడిపోయింది. తొలుత చైనా కన్నా ముందే 19వ నిమిషంలో రాణి చేసిన గోల్‌తో ఖాతా తెరిచిన భారత్ 1-0 ఆధిక్యాన్ని నిలుపుకోలేకపోయింది. వెంటనే చైనా క్రీడాకారిణి యూ కియాన్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించడంతో స్కోరు 1-1తో సమమైంది. అయితే చివరి క్వార్టర్‌లో వాంగ్ మెంగ్‌యూ(85వ ని.) గోల్ చేయడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. దీనికి ముందు భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement