హారిక, పద్మిని గేమ్‌లు ‘డ్రా’ | Harika, Padmini games 'draw' | Sakshi
Sakshi News home page

హారిక, పద్మిని గేమ్‌లు ‘డ్రా’

Feb 18 2017 12:15 AM | Updated on Sep 5 2017 3:57 AM

ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ తొలి

టెహరాన్‌ (ఇరాన్‌): ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ తొలి గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. సొపికో గురామిష్‌విలి (జార్జియా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన హారిక 49 ఎత్తుల్లో... తాన్‌ జోంగి (చైనా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన పద్మిని 60 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. శనివారం జరిగే రెండో రౌండ్‌లో గెలిచిన వారు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement