గేల్ క్యాచ్ అవుట్.. కాదు నాటౌట్ | gayle not out | Sakshi
Sakshi News home page

గేల్ క్యాచ్ అవుట్.. కాదు నాటౌట్

Feb 24 2015 11:45 AM | Updated on Sep 2 2017 9:51 PM

పాపం జింబాబ్వే ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది.

కాన్బెర్రా: పాపం జింబాబ్వే ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. పన్యగర వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్లో వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్మన్ గేల్ క్యాచ్ అవుటయ్యాడు. దీంతో గేల్ను అవుట్ చేయడానికి నానా తంటాలు పడుతున్న జింబాబ్వే ఆటగాళ్లు సంబరపడిపోయారు.

అయితే అంపైర్ నోబాల్గా ప్రకటించాడు. అంతే జింబాబ్వే శిబిరంలో సంతోషం క్షణాల్లో మాయమైంది. గేల్ నాటౌట్ గా మిగిలిపోయాడు. గేల్ (123) భారీ సెంచరీ దిశగా సాగుతూ జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement