కాంస్యం నెగ్గిన హర్ష | Sakshi
Sakshi News home page

కాంస్యం నెగ్గిన హర్ష

Published Thu, May 12 2016 1:07 AM

కాంస్యం నెగ్గిన హర్ష

భారత్‌కు పతకాల పంట
ఆసియా జూనియర్ చెస్

 
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన హర్ష భరతకోటి కాంస్య పతకం సాధించాడు. బుధవారం ముగిసిన ఈ పోటీల్లో హర్ష నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 6.5 పాయింట్లతో కార్తికేయన్ మురళీ (భారత్), మౌసవీ ఖలీల్ (ఇరాన్)లతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హర్షకు మూడో స్థానం దక్కింది.

మరోవైపు 7 పాయింట్లతో అరవింద్ చిదంబరం (భారత్) స్వర్ణం సొంతం చేసుకోగా... సునీల్‌దత్ నారాయణన్ (భారత్) రజతం సాధించాడు. బాలికల విభాగంలో  భారత్‌కు చెందిన నందిత, ఇవానా మరియా వరుసగా రజత, కాంస్య పతకాలు నెగ్గారు. ఇదే టోర్నీ బ్లిట్జ్ ఓపెన్ విభాగంలో సునీల్‌దత్ నారాయణన్, కల్యాణ్, అరవింద్... బాలికల విభాగంలో వైశాలి, వర్షిణి, బాలకణ్ణమ్మ వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించి క్లీన్‌స్వీప్ చేశారు. ఓవరాల్‌గా ఈ పోటీల్లో భారత్‌కు 11 పతకాలు వచ్చాయి.

Advertisement
Advertisement