అదిరే క్యాచ్‌తో బెన్‌స్టోక్స్‌ బెంబేలెత్తించాడు!

Ben Stokes Takes Spectacular Catch In England vs South Africa World Cup Match - Sakshi

లండన్‌ : ప్రపంచకప్‌ సమరం మొదలైందో లేదో అప్పుడే ప్రేక్షకులకు కావాల్సిన మజా దొరుకుతుంది. కళ్లు చెదిరే క్యాచ్‌లు.. ఔరా అనిపించే బౌండరీలు.. నోరెళ్లబెట్టే బంతులు.. ఆరంభ మ్యాచ్‌లోనే క్రికెట్‌ ప్రపంచాన్ని రంజింపచేశాయి. కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అద్భుత ప్రదర్శనతో సఫారీల ఓటమిని శాసించాడు.

బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ మూడు విభాగాల్లో అదరగొట్టి ఆల్‌రౌండర్‌ అంటే ఇలా ఉండాలని అనిపించుకున్నాడు. 79 బంతుల్లో 89 పరుగులు చేసిన స్టోక్స్‌.. రెండు వికెట్లు, రెండు క్యాచ్‌లు, ఒక రనౌట్‌తో సత్తా చాటాడు. ముఖ్యంగా అదిల్‌ రషిద్‌ బౌలింగ్‌లో  బౌండరీ వద్ద స్టోక్స్‌ అందుకున్న ఆండిల్‌ ఫెహ్లుకోవియా క్యాచ్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ది వరల్డ్‌గా నిలిచింది. యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఈ క్యాచ్‌ను చూసి సంబరపడుతోంది. ఒంటి చేత్తో సూపర్‌ మ్యాన్‌లా స్టోక్స్‌ అందుకున్న ఈ క్యాచ్‌ ఈ వరల్డ్‌కప్‌ బెస్ట్‌ క్యాచ్‌ జాబితాలో తప్పకుండా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
బెన్‌స్టోక్స్‌ స్టన్నింగ్ క్యాచ్

చదవండి: అదిరే ఆరంభం

ది గార్డియన్‌ సౌజన్యంతో

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top