జపాన్ జోరు | Asian Badminton Championship | Sakshi
Sakshi News home page

జపాన్ జోరు

Feb 17 2016 1:09 AM | Updated on Sep 3 2017 5:46 PM

జపాన్ జోరు

జపాన్ జోరు

స్టార్ ఆటగాళ్లతో కూడిన జపాన్ జట్లు ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయంతో శుభారంభం ...

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్

సాక్షి, హైదరాబాద్: స్టార్ ఆటగాళ్లతో కూడిన జపాన్ జట్లు ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయంతో శుభారంభం చేశాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్ మహిళల జట్టు 5-0తో సింగపూర్‌ను... జపాన్ పురుషుల జట్టు 5-0తోనే నేపాల్‌ను చిత్తుగా ఓడించాయి. మహిళల మూడు సింగిల్స్ మ్యాచ్‌ల్లో జపాన్ క్రీడాకారిణులు సయాకా సాటో 21-17, 21-17తో లియాంగ్ జియోవుపై... యు హాషిమోటో 21-15, 21-9తో జెన్ గ్రేస్ చువాపై... మినత్సు మితాని 19-21, 22-20, 21-19తో జియా మిన్ యోపై గెలిచారు. మిగతా రెండు డబుల్స్ మ్యాచ్‌ల్లో మిసాకి-అయాకా ద్వయం... నవోకో-కురిమి జోడీలు విజయం సాధించడంతో జపాన్ విజయం పరిపూర్ణమైంది. మహిళల విభాగం ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో చైనీస్ తైపీ 4-1తో శ్రీలంకపై, కొరియా 5-0తో మాల్దీవులుపై, మలేసియా 3-2తో హాంకాంగ్‌పై గెలిచాయి. పురుషుల విభాగం ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో మలేసియా 4-1తో శ్రీలంకపై, చైనీస్ తైపీ 5-0తో మాల్దీవులుపై, ఇండోనేసియా 4-1/3-2తో థాయ్‌లాండ్‌పై విజయం సాధించాయి. బుధవారం ఆతిథ్య భారత్ బరిలోకి దిగుతుంది. భారత పురుషుల, మహిళల జట్లు తమ తొలి లీగ్ మ్యాచ్‌ల్లో సింగపూర్ జట్లతో తలపడనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement