‘డబ్ల్యూటీఏ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా బార్టీ | Ashleigh Barty Wins WTA Player Of The Year Award | Sakshi
Sakshi News home page

‘డబ్ల్యూటీఏ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా బార్టీ

Dec 13 2019 10:22 AM | Updated on Dec 13 2019 10:22 AM

Ashleigh Barty Wins WTA Player Of The Year Award - Sakshi

ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌తో పాటు టెన్నిస్‌ ముగింపు సీజన్‌ టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టైటిల్‌ను గెలిచిన ఆ్రస్టేలియా భామ యాష్లే బార్టీ మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారం గెల్చుకుంది.

ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన నయోమి ఒసాకా (జపాన్‌–ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ విజేత), సిమోనా హలెప్‌ (రొమేనియా–వింబుల్డన్‌ విజేత), బియాంక ఆండ్రెస్కూ (కెనడా–యూఎస్‌ ఓపెన్‌ విజేత) ఈ అవార్డు కోసం పోటీపడ్డా... 82 శాతం ఓట్లు పొందిన బార్టీనే అవార్డు వరించింది. ఇవోని గూలాగాంగ్‌ (1976లో) తర్వాత నంబర్‌వన్‌ ర్యాంకును సొంతం చేసుకున్న తొలి ఆసీస్‌ క్రీడాకారిణిగా బార్టీ నిలువడం మరో విశేషం. ఆమె కోచ్‌ క్రెయిగ్‌ టైజెర్‌ ‘డబ్ల్యూటీఏ కోచ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నిలిచాడు.  

Advertisement
 
Advertisement
Advertisement