ఆనంద్ గేమ్ ‘డ్రా’ | anand game draw with Peter svidler | Sakshi
Sakshi News home page

ఆనంద్ గేమ్ ‘డ్రా’

Oct 5 2016 12:27 AM | Updated on Sep 4 2017 4:09 PM

తాల్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నాలుగో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు.

మాస్కో: తాల్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నాలుగో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. పీటర్ స్విద్లెర్ (రష్యా)తో మంగళవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఏడో రౌండ్ తర్వాత ఆనంద్ నాలుగు పాయి0ట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. మరోవైపు ఐల్ ఆఫ్ మ్యాన్ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి పరాజయాన్ని చవిచూసింది. మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్)తో జరిగిన మూడో రౌండ్‌లో హారిక 53 ఎత్తుల్లో ఓడిపోయి0ది.

Advertisement
 
Advertisement
Advertisement