ఐబా అంబాసిడర్‌గా మేరీ కోమ్ | Aiba Ambassador Mary Kom | Sakshi
Sakshi News home page

ఐబా అంబాసిడర్‌గా మేరీ కోమ్

Apr 15 2016 1:24 AM | Updated on Sep 3 2017 9:55 PM

ఐబా అంబాసిడర్‌గా మేరీ కోమ్

ఐబా అంబాసిడర్‌గా మేరీ కోమ్

భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీ కోమ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) ఆధ్వర్యంలో ....

న్యూఢిల్లీ:  భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీ కోమ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు మేరీ కోమ్‌ను అంబాసిడర్‌గా నియమించారు. ఓవరాల్‌గా ఎనిమిది మందిని ఐబా నియమించింది. ‘ఓ భారతీయురాలిగా ఈ గౌరవం దక్కినందుకు గర్విస్తున్నాను.

దీనిద్వారా నేను అంతర్జాతీయ బాక్సింగ్‌కు ప్రతినిధిగా వ్యవహరిస్తాను. ఇది అందరికీ దక్కే అ వకాశం కాదు’ అని ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన మేరీకోమ్ సంతోషం వ్యక్తం చేసింది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన తను రియో గేమ్స్‌లో చోటు కోసం వచ్చే నెల 19 నుంచి 27 వరకు కజకిస్తాన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొననుంది.

Advertisement
 
Advertisement
Advertisement