ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తిప్పేస్వామి | Thippeswamy Swearing As Madakasira MLA | Sakshi
Sakshi News home page

Dec 19 2018 10:34 AM | Updated on Dec 19 2018 10:53 AM

Thippeswamy Swearing As Madakasira MLA - Sakshi

సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా వైఎస్సార్‌ సీపీ నాయకులు తిప్పేస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని స్పీకర్‌ కార్యాలయంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగింది. కాగా, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఈరన్న.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇవ్వడంతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు. తిప్పేస్వామి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈరన్న ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుపై ఈరన్న సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తిప్పేస్వామి నేడు మడకశిర ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
 

చదవండి:

టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్‌.. ఎన్నిక చెల్లదని ఆదేశాలు

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement