పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారు | Sakshi
Sakshi News home page

పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారు

Published Tue, Oct 9 2018 3:33 AM

Pawan Kalyan Comments on Panchayati Raj system - Sakshi

కొయ్యలగూడెం: రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినా ఎన్నికలకు వెళ్లకపోవడాన్ని తప్పుబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార టీడీపీకి ప్రజలు బుద్ధి చెబుతారనే భయంతోనే ఎన్నికలకు వెళ్లలేదని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన పోటీ చేస్తుందన్నారు.

మంత్రిగా ఉన్న జవహర్‌ దళితులను దూషిస్తున్నా మిన్నకుంటున్నారని, విప్‌గా ఉన్న చింతమనేని ఆగడాలు చేస్తున్నా సీఎం  వెనుకేసుకు వస్తున్నారని, దీనికి వారు సిగ్గు పడాలన్నారు. 4,500 గ్రామాలు పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యాయని, లక్ష కుటుంబాలు రోడ్డున పడ్డాయని, 3 లక్షల మంది ప్రజల బతుకులు చిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరు ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన చరితార్థులు అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. వీరి తరఫున జనసేన పోరాడుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మసిపూసిన మారెడు కాయ అని, దాన్ని చూపించడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడెక్కడ నుంచో వేలాది మందిని తీసుకొస్తోందన్నారు. వారికి ముంపు ప్రాంతాల్లోని ప్రజల కష్టనష్టాలను  చూపిస్తే..వారే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement