దుకాణానికి వచ్చిన బాలికపై లైంగిక దాడి | Teenage girl raped by shopkeeper | Sakshi
Sakshi News home page

దుకాణానికి వచ్చిన బాలికపై లైంగిక దాడి

Jul 13 2016 1:44 PM | Updated on Sep 2 2018 4:03 PM

దుకాణానికి వచ్చిన బాలికపై లైంగిక దాడి - Sakshi

దుకాణానికి వచ్చిన బాలికపై లైంగిక దాడి

ముజఫర్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ పదమూడేళ్ల బాలికపై షాప్ కీపర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ విషయం బయటకు చెబితే చంపిపారేస్తానంటూ బెదిరించాడు.

లక్నో: ముజఫర్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ పదమూడేళ్ల బాలికపై షాప్ కీపర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ విషయం బయటకు చెబితే చంపిపారేస్తానంటూ బెదిరించాడు. బాధితురాలు ఇంట్లో చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి బాలికను వైద్య పరీక్షలకు పంపించారు.

పోలీసులకు అందింన ఫిర్యాదు ప్రకారం ముజఫర్ నగర్ జిల్లాలోని షాపూర్ పట్టణంలో ఓ పదమూడేళ్ల బాలిక వస్తువులు కొనుగోలు చేసేందుకు ఓ దుకాణానికి వెళ్లింది. అందులో పనిచేస్తున్న షాన్వాజ్ అనే యువకుడు వస్తువుల పేరిట ఆ బాలికను లోపలికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ముజఫర్ నగర్ లో ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement