తాత ... రికార్డుల మోత | Old man created the record | Sakshi
Sakshi News home page

తాత ... రికార్డుల మోత

Jun 16 2016 4:23 AM | Updated on Sep 4 2017 2:33 AM

తాత ... రికార్డుల మోత

తాత ... రికార్డుల మోత

ఒక్కడు...ఒకే ఒక్కడు...రికార్డుల మోత మోగిస్తున్నాడు. 1001 గంటల పాటు స్కూటర్ నడిపి ఓ రికార్డు....

న్యూఢిల్లీ: ఒక్కడు...ఒకే ఒక్కడు...రికార్డుల మోత మోగిస్తున్నాడు. 1001 గంటల పాటు స్కూటర్ నడిపి ఓ రికార్డు....నాలుగు నిమిషాల్లో టమాటా కెచప్ తాగేసి మరో రికార్డు...ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు పిజ్జా డెలివరీ చేసి ఇంకో రికార్డు...దంతాల్ని పీకేసుకుని 496 స్ట్రాలు నోట్లో పెట్టుకుని ప్రపంచ రికార్డు...ఈ రికార్డులన్నీ ఓ యువకుడివి అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే...ఇవన్నీ సొంతం చేసుకున్నది 74 ఏళ్ల వృద్ధుడు..అతనే ఢిల్లీకి చెందిన ప్రకాష్ రిషి...

పాశ్చాత్య దేశాల్లో సరదా కోసం కొత్తగా కనిపించడం కోసం వేయించుకునే టాటూలను ఒంటిపై వేసుకుని తాజాగా మరోసారి రికార్డులకెక్కాడు. ప్రపంచ ప్రముఖులైన మహాత్మాగాంధీ, ప్రధాని మోదీ, క్వీన్ ఎలిజబెత్, అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇలా 500కు పైగా ముఖచిత్రాల్ని, 396 జాతీయ జెండాలని టాటూగా వేయించుకుని రిషి ఇటీవలే గిన్నిస్ రికార్డులకెక్కాడు. అందుకనే ఈ తాతను...రికార్డుల తాతగా ఢిల్లీ ప్రజలు పిలుస్తుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement