నాగాలాండ్ కొత్త సీఎం జెలియాంగ్ | new Chief Minister of Nagaland jeliyang | Sakshi
Sakshi News home page

నాగాలాండ్ కొత్త సీఎం జెలియాంగ్

May 24 2014 1:32 AM | Updated on Sep 2 2017 7:45 AM

నాగాలాండ్ కొత్త సీఎం జెలియాంగ్

నాగాలాండ్ కొత్త సీఎం జెలియాంగ్

నాగాలాండ్ నూతన ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) నేత టి.ఆర్. జెలియాంగ్ శుక్రవారం నియమితులయ్యారు.

కోహిమా: నాగాలాండ్ నూతన ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) నేత టి.ఆర్. జెలియాంగ్ శుక్రవారం నియమితులయ్యారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నాగాలాండ్ లోక్‌సభా స్థానం నుంచి విజయం సాధించిన ప్రస్తుత ముఖ్యమంత్రి నిఫూ రియో శుక్రవారం సీఎం పదవికి, శాసనసభా స్థానానికి రాజీనామా చేయడంతో జెలియాంగ్‌ను గవర్నర్ అశ్వనీకుమార్ కొత్త సీఎంగా నియమించారు.

శనివారం జెలియాంగ్, ఆయన మంత్రివర్గంతో  ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేసే ఉద్దేశంతో పార్లమెంట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్న నిఫూ రియోను ప్రజలు 4 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిపించారు

Advertisement
 
Advertisement
Advertisement