దగ్గరుండి కొట్టించిన ఎమ్మెల్యే | Jitendra Awhad Supervises Girl Thrashing Alleged Stalker | Sakshi
Sakshi News home page

దగ్గరుండి కొట్టించిన ఎమ్మెల్యే

Sep 7 2016 12:14 PM | Updated on Oct 8 2018 5:45 PM

దగ్గరుండి కొట్టించిన ఎమ్మెల్యే - Sakshi

దగ్గరుండి కొట్టించిన ఎమ్మెల్యే

ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవహాద్ దగ్గరుండి యువకుడిపై యువతితో దాడి చేయించారు.

థానె: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవహాద్ దగ్గరుండి యువకుడిపై యువతితో దాడి చేయించారు. థానెలోని ఆయనకార్యాలయంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో కలకలం రేగింది. జితేంద్ర దగ్గరుండి యువకుడిని యువతితో కొట్టించినట్టు వీడియోలోని దృశ్యాల్లో స్పష్టంగా కనబడింది. తనను ప్రేమించమని యువకుడు వేధిస్తున్నాడని జితేంద్రకు యువతి ఫిర్యాదు చేసింది. అతడికి గుణపాఠం చెప్పాలని తన కార్యాలయానికి పిలిపించుకుని యువతితో కొట్టించారు.

అయితే తాను చేసిందాట్లో తప్పేంలేదని జితేంద్ర సమర్థించుకున్నారు. ‘నేను తప్పుచేసినట్టు మీడియా భావిస్తే నన్ను ఉరి తీయండ’ని ఆవేశంగా అన్నారు. ఫిర్యాదు చేసిన యువతి తన ఇంటికి సమీపంలోని మురికివాడలో నివసిస్తోందని చెప్పారు. యువకుడి వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు. యువకుడిపై వేధింపుల కేసు నమోదు చేశారు. జితేంద్ర వ్యతిరేకంగా ఎటువంటి కేసు పెట్టలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement