ప్రేమ వివాహం.. అంతలోనే ఆత్మహత్య | husband suicide due to family problems in karnataka | Sakshi
Sakshi News home page

ప్రేమ వివాహం.. అంతలోనే ఆత్మహత్య

Jun 11 2017 9:17 AM | Updated on Sep 5 2017 1:22 PM

ప్రేమ వివాహం.. అంతలోనే ఆత్మహత్య

ప్రేమ వివాహం.. అంతలోనే ఆత్మహత్య

నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు అంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మాలూరు (బెంగళూరు) : నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు అంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మాలూరులోని మారుతీ కాలనీలో చోటు చేసుకుంది. నల్లాండహళ్లి గ్రామానికి చెందిన సుధాకర్‌ (28) స్థానిక మాడ్రన్‌ పాఠశాల వద్ద అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. సమీపంలోని పారిశ్రామిక వాడలో ఓ ఫ్యాక్టరీలో పని చేసేవాడు.  

మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన యశోద అనే యువతిని సుధాకర్‌ ప్రేమించాడు. నెల రోజుల క్రితం ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం పనికి వెళ్లిన సుధాకర్‌ సాయంత్రం ఇంటికి చేరుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement