రూపాయి వచ్చేది, వెళ్లేది ఇలా.. | how a rupee comes from and goes to in union budget | Sakshi
Sakshi News home page

రూపాయి వచ్చేది, వెళ్లేది ఇలా..

Feb 29 2016 2:47 PM | Updated on Apr 6 2019 9:38 PM

కొన్ని లక్షల కోట్లతో కూడిన బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం అంటే కత్తిమీద సామే అవుతుంది. ఏయే రంగాలకు ఎంత కేటాయించాలి, దానికి ఆదాయ మార్గాలు ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి.

కొన్ని లక్షల కోట్లతో కూడిన బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం అంటే కత్తిమీద సామే అవుతుంది. ఏయే రంగాలకు ఎంత కేటాయించాలి, దానికి ఆదాయ మార్గాలు ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ కసరత్తు అంతటినీ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని పలువురు నిపుణులు పూర్తి చేస్తారు. వారికి మార్గదర్శకాలను మాత్రం  ఆర్థికమంత్రి, ప్రధానమంత్రి తదితరులు ఇస్తారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపాయి రాక, పోకల వివరాలు ఇలా ఉన్నాయి..

రూపాయి రాక

1 అప్పులు, ఇతర రుణాలు - 21
2 కార్పొరేషన్ టాక్స్ - 19
3 ఆదాయపన్ను - 14
4 కస్టమ్స్ -9
5 కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ -12
6 సేవాపన్ను, ఇతర పన్నులు - 9
7 పన్నేతర ఆదాయం - 13
8 రుణేతర కేపిటల్ ఆదాయం 3
----------------
రూపాయి పోక


1 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రణాళికేతర సాయం - 5
2 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రణాళికా సాయం - 9
3 కేంద్ర ప్రణాళిక - 12
4 వడ్డీల చెల్లింపు - 19
5 రక్షణ రంగం - 10
6 సబ్సిడీలు - 10
7 ఇతర ప్రణాళికేతర వ్యయం - 12
8 పన్నులు, డ్యూటీలలో రాష్ట్రాల వాటా - 23

Advertisement
 
Advertisement
Advertisement