విద్యార్థినిపై కొడవలితో దాడి | girl student attacked in polytechnic college with sickle | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై కొడవలితో దాడి

Apr 11 2015 6:11 PM | Updated on Sep 3 2017 12:10 AM

ఓ విద్యార్థినిపై సహ విద్యార్థి కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరచిన ఘటన బెంగళూరులో శనివారం జరిగింది.

బెంగళూరు :ఓ విద్యార్థినిపై సహ విద్యార్థి కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరచిన ఘటన బెంగళూరులో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... కుంబళగూడుకు చెందిన ఓ విద్యార్థిని(21) సుంకదకట్టలోని పాలిటెక్నిక్ కళాశాలలో చివరి ఏడాది చదువుతోంది.  రాజగోపాల్ నగర్‌కు చెందిన యోగేష్(21) అనే విద్యార్థి కూడా అదే కళాశాలలో చివరి ఏడాది చదువుతున్నాడు.

 

అయితే శనివారం ఉదయం 9గంటలకు విద్యార్థిని కళాశాలకు రాగా, అప్పటికే అక్కడ వేచి ఉన్న యోగేష్ ఒక్కసారిగా ఆమెపై విచక్షణారహితంగా కొడవలితో దాడి చేసి పరారయ్యాడు. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే బాధిత విద్యార్థినిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి బాధిత విద్యార్థిని  పరిస్థితి విషమంగా ఉంది. కాగా నిందితుడు యోగేష్‌ను పోలీసులు మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement