రేపు వి.ఎస్ సంపత్ పదవీ విరమణ | election commisiner vs sampath retirement | Sakshi
Sakshi News home page

రేపు వి.ఎస్ సంపత్ పదవీ విరమణ

Jan 14 2015 3:36 PM | Updated on Sep 2 2017 7:43 PM

రేపు వి.ఎస్ సంపత్ పదవీ విరమణ

రేపు వి.ఎస్ సంపత్ పదవీ విరమణ

కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ వీ.ఎస్. సంపత్ పదవీ విరమణ చేయనున్నారు.

న్యూడిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ వి.ఎస్. సంపత్ పదవీ విరమణ చేయనున్నారు. రేపటితో ఆయన పదవీకాలం పూర్త అవుతుంది. 2012 లో ప్రధాన ఎన్నికల కమీషనర్ గా ఆయన భాద్యతలు స్వీకరించారు. 1973 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారి అయిన సంపత్  చురుకైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.  ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసిన అనుభవమున్న ఆయన... అంతకుముందు కేంద్ర విద్యుత్తుశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు.  2009లో ఈసీగా ఎన్నికైన సంపత్ సీనియర్ ఎన్నికల కమిషనర్గా పనిచేశారు. 

సంపత్ ఆధ్వర్యంలోనే కీలకమైన 2014 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆఖరిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ను వీఎస్ సంపత్ విడుదల చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement