ఫేస్‌బుక్‌ స్నేహితురాలి కోసం వెళ్తే.. | 2 youths who had come to meet their female FB friends beaten up allegedly by Bajrang Dal activists | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ స్నేహితురాలి కోసం వెళ్తే..

May 20 2017 5:35 PM | Updated on Jul 26 2018 5:23 PM

ఫేస్‌బుక్‌ స్నేహితురాలి కోసం వెళ్తే.. - Sakshi

ఫేస్‌బుక్‌ స్నేహితురాలి కోసం వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లో యాంటీ రోమియో స్క్వాడ్‌ చురుకుగా పనిచేస్తున్నా.. బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు కూడా అంతకు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌లో యాంటీ రోమియో స్క్వాడ్‌ చురుకుగా పనిచేస్తున్నా.. బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు కూడా అంతకు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. స్నేహితురాళ్లను కలుసుకోవడానికి వెళ్లిన ఇద్దరు యువకులను పట్టుకొని అక్కడి బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు చితకబాదుతున్న వీడియో ఒకటి తాజాగా సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది.

ముజఫర్‌నగర్‌లో ఫేస్‌బుక్‌ స్నేహితురాళ్లను కలుసుకోవడానికి వెళ్లిన ఇద్దరు యువకులు బజరంగ్‌దళ్‌ కార్యకర్తల చేతికి చిక్కారు. దీంతో.. తీవ్రంగా దుర్భాషలాడుతూ బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ఆ యువకులపై దాడి చేశారు. యువకులను చితకబాదుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. యూపీలో యాంటీ రోమియో స్క్వాడ్‌ అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని విమర్శలు వినిపిస్తున్న తరుణంలో.. బజరంగ్‌దళ్‌ కార్యకర్తల వీరంగం బయటకురావడం కలకలం రేపుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement