సునీల్‌ డ్యాన్స్‌ చూస్తుంటే ముచ్చటేస్తుంది | Vinayak's release of 'ungarala rambabu' trailer | Sakshi
Sakshi News home page

సునీల్‌ డ్యాన్స్‌ చూస్తుంటే ముచ్చటేస్తుంది

Jun 8 2017 11:49 PM | Updated on Sep 5 2017 1:07 PM

సునీల్‌ డ్యాన్స్‌ చూస్తుంటే ముచ్చటేస్తుంది

సునీల్‌ డ్యాన్స్‌ చూస్తుంటే ముచ్చటేస్తుంది

‘‘సునీల్‌ నాకు సినిమా ఇండస్ట్రీకి రాక ముందు నుంచీ తెలుసు. తనలో మంచి డ్యాన్సర్‌ ఉన్నాడు.

– వీవీ వినాయక్‌
‘‘సునీల్‌ నాకు సినిమా ఇండస్ట్రీకి రాక ముందు నుంచీ తెలుసు. తనలో మంచి డ్యాన్సర్‌ ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు తనలోని నృత్య ప్రతిభను అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు. తెరపై సునీల్‌ డ్యాన్సులు చూస్తుంటే ముచ్చటేస్తుంది. ‘ఉంగరాల రాంబాబు’ ట్రైలర్‌ చాలా బాగుంది. సినిమా హిట్‌ అయి, యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలి’’ అని దర ్శకుడు వీవీ వినాయక్‌ అన్నారు.

సునీల్, మియా జార్జ్‌ జంటగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మించిన ‘ఉంగరాల రాంబాబు’ ట్రైలర్‌ను వినాయక్‌ విడుదల చేశారు. సునీల్‌ మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో ఎప్పటికైనా సక్సెస్‌ అవుతామని నేను, వినాయక్‌గారు  అనుకునేవాళ్లం. అలాగే అయ్యాం. నా చిత్రాల్లో కామెడీ ఉండటం కామన్‌. కానీ, ‘ఉంగరాల రాంబాబు’లో మరింత ఎక్కువ వినోదం ఉంటుంది. ఈ సినిమాతో క్రాంతిమాధవ్‌గారు గొప్ప దర్శకుల జాబితాలో చేరతారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘రెండు, మూడు పాయింట్లను కలిపి ఈ సినిమా చేశా. వైవిధ్యమైన కామెడీ అలరిస్తుంది. పోసానిగారి పాత్ర హైలెట్‌. జిబ్రాన్‌ మంచి సంగీతం అందించారు’’ అన్నారు క్రాంతి మాధవ్‌. పరుచూరి కిరీటి, మియాజార్జ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement