‘డియర్‌ కామ్రేడ్‌’ అంటున్న అర్జున్‌ రెడ్డి | Vijay Devarakonda Next Movie Title Dear Comrade | Sakshi
Sakshi News home page

May 8 2018 3:18 PM | Updated on May 8 2018 6:05 PM

Vijay Devarakonda Next Movie Title Dear Comrade - Sakshi

అర్జున్‌ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌, ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. రేపు (మే 9న) రిలీజ్‌ అవుతున్న మహానటిలో కీలక పాత్రలో నటించిన విజయ్‌ దేవరకొండ, మరో సినిమా టాక్సీవాలా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలతో పాటు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘నోటా’ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ఈ మధ్యే ప్రారంభించాడు.

నోటా చిత్రం సెట్స్‌ మీద ఉండగానే మరో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు విజయ్‌. పెళ్లిచూపులు సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన యాష్‌ రంగినేని నిర్మాణంలో భరత్‌ కమ్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్‌ లీడ్‌ రోల్‌లో నటించనున్నాడు. ఈ సినిమాకు డియర్‌ కామ్రేడ్‌ అనే టైటిల్‌ను ఫైనల్‌ చేసిట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్‌ త్వరలో సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement