కుప్పకూలిపోయాను! | tapsee Pink' trailer released | Sakshi
Sakshi News home page

కుప్పకూలిపోయాను!

Aug 11 2016 11:19 PM | Updated on Aug 13 2018 3:04 PM

కుప్పకూలిపోయాను! - Sakshi

కుప్పకూలిపోయాను!

‘అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు’ అని గాంధీజీ అన్నారు. ‘నిర్భయ’ వంటి ఘటనలు చూసిన ..

‘అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు’ అని గాంధీజీ అన్నారు. ‘నిర్భయ’ వంటి ఘటనలు చూసిన తర్వాత దేశంలో అర్ధరాత్రి ఆడది తిరిగే పరిస్థితి ఉందా? అని ప్రశ్నిస్తే, జవాబు చెప్పడం కష్టమే. ‘అత్యాచారాల నుంచి మహిళలకు విముక్తి లభించినప్పుడే స్వాతంత్య్రం వచ్చినట్టు. అలాంటి భారతదేశాన్ని చూడాలనుకుంటున్నా’ అని అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యానించారు. అమితాబ్, తాప్సీ ముఖ్య తారలుగా నటించిన ‘పింక్’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పై వ్యాఖ్యలు చేశారాయన.

ఈ చిత్రంలో లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిగా తాప్సీ నటించారు. ‘‘వ్యక్తిగతంగా ఈ పాత్ర నాపై ప్రభావం చూపింది. భావోద్వేగాలు అదుపు చేసుకోవడం కష్టమైంది. ఏడుస్తూ పలుసార్లు సెట్‌లో కుప్పకూలా. పాత్రలో ఒదిగిపోయి నటించా. ఈ సినిమా షూటింగ్ జరిగిన రెండు నెలలు మరో సినిమా చేయలేదు’’ అని తాప్సీ పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement