సైలెంట్ గా మొదలుపెట్టాడు..! | Sudheer Babu turns producer | Sakshi
Sakshi News home page

సైలెంట్ గా మొదలుపెట్టాడు..!

Nov 16 2017 12:33 PM | Updated on Nov 16 2017 12:33 PM

Sudheer Babu turns producer  - Sakshi

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ కథానాయకుడు సుధీర్ బాబు. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఆసక్తికరమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్న సుధీర్ బాబు నెగెటివ్ రోల్స్ లోనూ నటిస్తున్నాడు. ఇటీవల శమంతకమణి సినిమాతో మల్టీ స్టారర్ సినిమాలోనూ నటించిన యంగ్ హీరో సుధీర్ బాబు త్వరలో సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇటీవల ఒకేసారి అరడజను సినిమాలను ప్రకటించిన సుధీర్, ఓ సినిమాను తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఇప్పటి వరకు బ్యానర్ పేరు ఫైనల్ చేయకపోయినా.. సినిమాను మాత్రం పూర్తి చేసేస్తున్నాడట. రామానాయుడు ఫిలిం ఇన్సిస్టిట్యూట్ లో శిక్షణ పొందిన నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తయిందన్న టాక్ వినిపిస్తోంది. తన కెరీర్ లో ఇంతవరకు ఒక్క ఫ్యామిలీ లవ్ స్టోరిలో కూడా నటించని సుధీర్ ఈ సినిమాతో ఆ లోటు కూడా తీర్చేందుకు రెడీ అవుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement