జెన్నిఫర్‌ లోపెజ్‌ ఇంట్లో... | Sreenu Vaitla thrilled to shoot Ravi Teja's AAA in Jennifer Lopez's mansion | Sakshi
Sakshi News home page

జెన్నిఫర్‌ లోపెజ్‌ ఇంట్లో...

Apr 5 2018 12:51 AM | Updated on Apr 5 2018 10:13 AM

Sreenu Vaitla thrilled to shoot Ravi Teja's AAA in Jennifer Lopez's mansion - Sakshi

రవితేజ

సాంగ్స్, ఫైట్స్, రొమాన్స్, లొకేషన్స్‌ అదిరిపోవద్దూ... పదేళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్‌లో మూవీ సెట్‌ అయితే. అలాగే అదరగొడుతున్నారు దర్శకుడు శ్రీనువైట్ల. ‘నీకోసం, వెంకీ, దుబాయ్‌ శీను’ తర్వాత రవితేజ హీరోగా తాను తెరకెక్కిస్తోన్న  ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ సినిమా కోసం  హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ జెన్నిఫర్‌ లోపెజ్‌ ఇంటిని ఒక లొకేషన్‌గా సెలక్ట్‌ చేశారాయన. అమెరికాలో ఉన్న లోపెజ్‌ మ్యాన్షన్‌ పరిసర ప్రాంతాల్లో మంచు బాగా కురుస్తోందట. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 1న స్టారై్టంది. ఎక్కువ శాతం అమెరికాలోనే షూటింగ్‌ జరుపనున్నారు.  ‘‘జెన్నిఫర్‌ లోపెజ్‌ మ్యాన్షన్‌లో సినిమా షూటింగ్‌ జరుపుతుండటం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది.

ఆమెకు వీరాభిమానిని. ఈ ప్లేస్‌లో షూటింగ్‌ చేయడానికి సహకరించిన మిత్రులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు శ్రీను వైట్ల.  ప్రస్తుతం ఈ మ్యాన్షన్‌లో జెన్నిఫర్‌ లోపెజ్‌ ఉండటం లేదు. ఆ సంగతలా ఉంచితే... మంచు కురిసే వేళలో రీల్‌పై నాయకా నాయికలు రవితేజ, అనూ ఇమ్మాన్యుయేల్‌ కెమిస్ట్రీ సిల్వర్‌ స్క్రీన్‌పై ఎలా ఉంటుందో చూడాలంటే వెయిట్‌ అండ్‌ సీ. రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో  సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, రవితేజ తనయుడు మహాధన్, అలనాటి హీరోయిన్‌ లయ, ఆమె తనయ శ్లోక ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement