ఆ ముద్దు నేను పెట్టలేదు | Simbu smooching actress Harshika caught on CCTV? | Sakshi
Sakshi News home page

ఆ ముద్దు నేను పెట్టలేదు

Sep 24 2014 12:28 AM | Updated on Sep 2 2017 1:51 PM

ఆ ముద్దు నేను పెట్టలేదు

ఆ ముద్దు నేను పెట్టలేదు

నటుడు శింబుకు ముద్దు పెట్టింది తాను కాదంటోంది కన్నడ నటి హర్షిక. శింబు ఒక నటిని గాఢంగా ముద్దుపెట్టుకుంటున్న సన్నివేశాలు ఇంటర్నెట్‌లో ప్రచారమై కలకలం సృష్టిస్తున్నాయి.

నటుడు శింబుకు ముద్దు పెట్టింది తాను కాదంటోంది కన్నడ నటి హర్షిక. శింబు ఒక నటిని గాఢంగా ముద్దుపెట్టుకుంటున్న సన్నివేశాలు ఇంటర్నెట్‌లో ప్రచారమై కలకలం సృష్టిస్తున్నాయి. ఒక నక్షత్ర హోటల్లో ఈ చుంబనాల దృశ్యాలను చిత్రీకరించారు. ఇటీవల పలువురు నటీనటులు మలేషియాలో జరిగిన స్టార్‌నైట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు అక్కడి నక్షత్ర హోటల్లో ఈ ముద్దు సన్నివేశాల వీడియోను చిత్రీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సన్నివేశాల్లో శింబుపై ముద్దుల వర్షం కురిపించింది కన్నడ నటి హర్షిక అనే కథనాలు వెలువడుతున్నయి. అయితే ఈ ప్రచారాన్ని నటి హర్షిక ఖండించింది. దీని గురించి ఆమె స్పందిస్తూ వీడియోలో ఉన్న నటిని తాను కాదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తన పేరును పొరపాటుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. నటుడు శింబు కూడా ఆ వీడియోలో ఉన్న నటుడిని తాను కాదని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement