షకీలా ఆత్మకథతో సినిమా! | Shakeela Biography shakes Film Industry | Sakshi
Sakshi News home page

షకీలా ఆత్మకథతో సినిమా!

Feb 27 2014 11:00 PM | Updated on Sep 2 2017 4:10 AM

షకీలా ఆత్మకథతో సినిమా!

షకీలా ఆత్మకథతో సినిమా!

ఒకప్పుడు షకీలా చిత్రాలంటే ‘హాట్’ కేకులే. వాటి దెబ్బకి స్టార్ల చిత్రాలే బెంబేలెత్తిపోయేవి. అందుకే, తమ సినిమాల విడుదల సమయంలో షకీలా సినిమాలు అడ్డు

ఒకప్పుడు షకీలా చిత్రాలంటే ‘హాట్’ కేకులే. వాటి దెబ్బకి స్టార్ల చిత్రాలే బెంబేలెత్తిపోయేవి. అందుకే, తమ సినిమాల విడుదల సమయంలో షకీలా సినిమాలు అడ్డు రాకూడదని అప్పట్లో మలయాళ హీరోలు ఓ నిబంధన విధించారు. అయితే, ఆ తర్వాత వారికి షకీలా టెన్షన్ లేకుండాపోయింది. ఆమె హాట్ చిత్రాలు చేయడం మానుకున్నారు. కొంచెం నీట్‌గా ఉండే పాత్రలు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల తన ఆత్మకథ రాశారు షకీలా.
 
 అప్పట్లో షకీలా సినిమాల్లానే ఇప్పుడీ ఈ పుస్తకం హాట్ కేక్‌లా అమ్ముడుపోయింది. ఈ ఆత్మకథ చదివిన షకీలా ఫ్రెండ్స్.. ‘దీన్ని సినిమాగా తీస్తే బాగుంటుంది’ అన్నారట. ఆ ఆలోచన షకీలాకి కూడా నచ్చింది. దక్షిణాది భాషలతో పాటు, సౌత్‌లోనూ షకీలా నటించారు కాబట్టి, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాని నిర్మించాలనుకుంటున్నారామె. కె. తిరుమల్ దర్శకుడు. ఓ ప్రముఖ తారతో తన పాత్రను నటించజేయాలనుకుంటున్నారు షకీలా.

Advertisement
 
Advertisement
Advertisement