మరో లోకంలో విహరిస్తారు | Sanjeevani Telugu Movie Audio Launch | Sakshi
Sakshi News home page

మరో లోకంలో విహరిస్తారు

May 21 2018 2:13 AM | Updated on May 21 2018 2:13 AM

Sanjeevani Telugu Movie Audio Launch - Sakshi

శ్వేత

‘‘సంజీవని’ విజువల్స్‌ చూశా. రెండు సంవత్సరాలుగా యంగ్‌ బ్యాచ్‌ చాలా కష్టపడి మంచి అవుట్‌పుట్‌ సాధించారు. టైటిల్‌ ‘సంజీవని’ అని పెట్టడంలోనే వీరంతా సక్సెస్‌ సాధించేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. మనోజ్‌ చంద్ర, అనురాగ్‌ దేవ్, శ్వేత ముఖ్య తారలుగా రవి వీడే దర్శకత్వంలో జి.నివాస్‌ నిర్మించిన చిత్రం ‘సంజీవని’. శ్రవణ్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను విజయేంద్ర ప్రసాద్‌ రిలీజ్‌ చేశారు.

రవి వీడే మాట్లాడుతూ –‘‘ఫస్ట్‌ టైమ్‌ భారత దేశంలో హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో కలిసి రెండేళ్లు కష్టపడి తెరకెక్కించిన చిత్రం ‘సంజీవని’. తెలుగులో మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ వాడి హాలీవుడ్‌ రేంజ్‌లో భారీ గ్రాఫిక్స్‌తో నిర్మించాం. మా సినిమాకి వచ్చిన ప్రేక్షకులు మరో లోకంలో విహరిస్తారని గ్యారంటీగా చెప్పగలను. జూన్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకడు కె.యం.రాధాకృష్ణ, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్‌ ఆఫ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కల్చర్‌ ఆఫ్‌ తెలంగాణ  మామిడి హరికృష్ణ, ఆల్‌ ఇండియా రేడియో సీనియర్‌ ఎనౌన్సర్‌ శ్రీలక్ష్మీ ఐనంపూడి, లక్ష్మీ పిక్చర్స్‌ అధినేత బాపిరాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement