కపూర్‌ ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్‌! | Sanjay Kapoor Words On Daughter Shanaya Bollywood Debut | Sakshi
Sakshi News home page

కపూర్‌ ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్‌!

Jun 16 2018 3:13 PM | Updated on Jun 16 2018 6:28 PM

Sanjay Kapoor Words On Daughter Shanaya Bollywood Debut - Sakshi

తండ్రి సంజయ్‌ కపూర్‌తో షనాయా కపూర్‌

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌- శ్రీదేవి దంపతుల కూతురు జాన్వీ కపూర్‌ ‘దడక్‌’  సినిమాతో ఈ ఏడాది బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. తాజాగా కపూర్ల ఫ్యామిలీ నుంచి మరో అమ్మాయి కూడా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారని వినికిడి. బోనీ కపూర్‌ సోదరుడు సంజయ్‌ కపూర్‌ కూతురు షనాయాను ఈ ఏడాది హీరో​యిన్‌గా పరిచయం చేసేందుకు కపూర్ల ఫ్యామిలీ సన్నాహాకాలు చేస్తోందట.

ఈ విషయం గురించి సంజయ్‌ కపూర్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ....‘ షనాయా ప్రస్తుతం ప్లస్‌ టూ పూర్తి చేసింది. అయితే ఏం జరుగుతుందో ముందే ఊహించలేం కదా. తన కెరీర్‌ గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ కచ్చితంగా తను అనుకున్నది సాధిస్తుంది. ఇప్పటివరకైతే ఏ మూవీకి సైన్‌ చేయలేదు. అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయం’టూ పేర్కొన్నారు. అక్క సోనమ్‌ పెళ్లిలో, జాన్వీ కపూర్‌ ‘దడఖ్‌’  ట్రైలర్‌ విడుదల సమయంలో ఫొటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షించిన షనాయాకు ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ ఫ్యాలోయింగ్‌ పెరిగిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement