నన్ను మార్చివేసిన పాత్ర అది: సమంత | Samantha Talks about Jessi | Sakshi
Sakshi News home page

Nov 1 2018 7:16 PM | Updated on Jul 14 2019 4:41 PM

Samantha Talks about Jessi - Sakshi

సాక్షి, తమిళసినిమా: జెస్సీని జీవితంలో మరవలేను అంటున్నారు సమంత అక్కినేని.. పుట్టినిల్లు చెన్నైను వదిలి మెట్టినిల్లు హైదరాబాద్‌లో మకాం పెట్టిన ఈ అమ్మడు.. వివాహానంతరం సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గానే కాదు అగ్ర కథానాయికగా కూడా రాణిస్తున్నారు. తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమంత ఇటీవల తన సినీ అనుభవాలను పంచుకున్నారు.

నటీనటులకు ఏ పాత్ర ఎంతగా నచ్చుతుందో చెప్పలేమని, అయితే, పాత్రలను సులభంగా చేయగలమని ఎప్పుడూ నటులు భావించరాదని సమంత చెప్పారు. సుదీర్ఘ తన సినీప్రయాణంలో తాను నటించిన ప్రతి పాత్ర తనకు ముఖ్యమైనదేనని తెలిపారు. చేసే పాత్రను అర్థం చేసుకుని.. ఆ పాత్రగా మారడానికి ప్రయత్నిస్తానని, అలా సినిమాల్లోని పాత్రల ద్వారా జీవితంలోని మంచిచెడులను దగ్గరగా చూశానని, చాలా విషయాలు తెలుసుకున్నానని తెలిపారు.

తాను నటించిన ‘ఏ మాయ చేశావే’ చిత్రంలోని జెస్సీ పాత్రను జీవితంలో మరవలేనని, తననే మార్చిన పాత్ర అది అని సమంత పేర్కొన్నారు. నటిగా తాను నిలదొక్కుకోవడానికి జెస్సీ పాత్రనే కారణమని చెప్పారు. ఈ సినిమా తర్వాతనే సమంతకు ఎలాంటి పాత్రలను ఇవ్వాలన్నది దర్శకులు ఆలోచించడం మొదలెట్టారని, మంచి పాత్రలు రావడానికి ఆ చిత్రమే కారణమని తెలిపారు. అప్పటినుంచి పాత్రల ఎంపికలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించినట్లు చెప్పారు. ఆ ప్రయాణమే నటిగా తననీ స్థాయిలో నిలబెట్టిందని తెలిపారు. యూటర్న్‌ చిత్రం తరువాత ఒక ప్రయోగాత్మక చిత్రంలో నటించడానికి సమంత సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ చిత్రం కోసం 70 ఏళ్ల బామ్మగా మారడానికి ఆమె సిద్ధమవుతున్నట్టు టాక్‌ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement