
కార్తికేయ, పాయల్ రాజ్‌పుట్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆర్‌ఎక్స్ 100 (RX 100). ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకున్న ఆర్‌ఎక్స్ 100 టీం తాజాగా రెప్పల నిండై అంటూ సాగే మరో సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కేసీడబ్ల్యూ బ్యానర్ పై జి. అశోక్ రెడ్డి తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు రావురమేష్, సింధూర పువ్వు రాంఖీ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను భావోద్వేగాలతో కూడిన సహజమైన ప్రేమకథగా తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. కబాలి సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకు ప్రవీణ్ కే ఎల్ ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.