రోటీన్‌ సినిమాలు ఇష్టపడేవాళ్లు మా సినిమాకు రావద్దు | Rx 100 movie second trailer release | Sakshi
Sakshi News home page

రోటీన్‌ సినిమాలు ఇష్టపడేవాళ్లు మా సినిమాకు రావద్దు

Jul 8 2018 12:29 AM | Updated on Jul 8 2018 2:22 AM

Rx 100 movie second trailer release - Sakshi

అజయ్‌ భూపతి, రావు రమేశ్, కార్తికేయ, అశోక్‌ రెడ్డి

‘‘నాకు రొటీన్‌ సినిమాలు ఇష్టం ఉండదు. రొటీన్‌ సినిమాలు  ఇష్టపడేవాళ్లు నా సినిమాకు రావొద్దు. ఒకవేళ ఈ సినిమా సరిగ్గా ఆడకపోతే ఊరెళ్లి గేదెలు మేపుకుంటాను’’ అన్నారు అజయ్‌ భూపతి. కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో అశోక్‌రెడ్డి గుమ్మడికొండ నిర్మించిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా సెకండ్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. అజయ్‌ మాట్లాడుతూ – ‘‘మా రెండు ట్రైలర్స్‌ పక్కన పెట్టి చూస్తే సినిమా కథ అర్థం అయిపోతుంది. మా నిర్మాత గట్స్‌ ఉన్న ఆయన.

కార్తికేయ తన బెస్ట్‌ ఇచ్చాడు. సాంగ్స్, ఎyì టింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అన్నీ బాగా కుదిరాయి’’ అన్నారు. ‘‘దర్శకుడు చెప్పిన కథ అద్భుతంగా అనిపించింది. కార్తికేయ రాకింగ్‌ పెర్ఫార్మెన్స్‌ చేశాడు. అజయ్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు’’ అన్నారు రావు రమేశ్‌. ‘‘మంచి కంటెంట్‌ ఇస్తే ప్రేక్షకులు హిట్‌ చేస్తారన్న నమ్మకం ఉంది. సినిమా మా అందర్నీ తలెత్తుకునేలా చేస్తుంది’’ అన్నారు కార్తికేయ.  ‘‘మా టైటిల్‌ ‘ఆర్‌ఎక్స్‌ 100’. సేఫ్టీ ముఖ్యం అనుకుని, మంచి క్వాలిటీ ఉన్న హెల్మెట్స్‌ను ఫ్రీగా పంచనున్నాం’’ అన్నారు అశోక్‌ రెడ్డి. ఈ వేడుకలో పలువురు ట్రాఫిక్‌ పోలీసులు పాల్గొన్నారు. కొందరికి హెల్మెట్స్‌ అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement