‘మహానటి’ శాటిలైట్‌ హక్కులపై రూమర్స్‌ | Rumors On Mahanti Movie Satellite Rights | Sakshi
Sakshi News home page

May 24 2018 2:06 PM | Updated on Sep 28 2018 4:10 PM

Rumors On Mahanti Movie Satellite Rights - Sakshi

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏది ప్రధానంగా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఒకప్పుడు ఫలానా సినిమాలు ఎన్ని రోజులు, ఎన్ని సెంటర్లో ఆడాయి... అని లెక్కేసుకునేవారు. ఇప్పుడు ఫస్ట్‌ డే కలెక్షన్‌, వంద, రెండు వందల కోట్ల క్లబ్‌ అంటూ మాట్లాడుకుంటున్నారు. దీనిలో భాగంగానే సినిమా డిజిటల్‌ రైట్స్‌, శాటిలైట్‌ రైట్స్‌ ఎంత పలుకుతున్నాయో కూడా ప్రస్తుతం బాగా పాపులర్‌ అయ్యాయి. 

ఫలానా సినిమా శాటిలైట్‌ రైట్స్‌ను ఎంతకు అమ్మారు... ఏ ఛానల్‌‍కు అమ్మారు లాంటి విషయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ప్రస్తుతం మహానటికి సంబంధించిన ఈ విషయాలే హల్‌చల్‌ చేస్తున్నాయి. మహానటి విడుదలైనప్పటి నుంచి విజయవంతంగా దూసుకెళ్తోంది. కలెక్షన్స్‌ కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఓవర్సిస్‌లో కూడా ఈ సినిమా బాగానే రన్‌ అవుతోంది. అయితే మహానటి శాటిలైట్‌ రైట్స్‌ను దాదాపు 18కోట్లకు అమ్మాలని నిర్మాతలు అనుకుంటున్నారని సమాచారం. అయితే సినిమాకు పెరుగుతున్న ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని పలు ఛానెళ్లు ఈ రైట్స్‌కు పోటీపడుతున్నట్లు సమాచారం. ఈ సినిమా టీవీలో ప్రసారం అయితే టాప్‌ రేటింగ్‌ రావడం ఖాయమంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.  

  

Advertisement
 
Advertisement
Advertisement